Saturday, May 17, 2025

ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

ఇక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదు
గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌ఫోళ్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి
సచివాలయం, నెక్లెస్ రోడ్డు, కెబిఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలి
విద్యుత్ శాఖ అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు (underground power lines) ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదని ఆయన ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌ఫోళ్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్డు, కెబిఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలన్నారు. 160 కిలో మీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు పొడవునా సోలార్ విద్యుత్ వినియోగించుకునేలా ప్రణాళిక చేయాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు.

క్లీన్ ఎనర్జీ, పంప్డ్‌స్టోర్‌లపై దృష్టి సారించాలి

వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని సిఎం అన్నారు. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్లీన్ ఎనర్జీ, పంప్డ్‌స్టోర్‌లపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని సిఎం చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు.

రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను (underground power lines) దృష్టిలో పెట్టుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సిఎం చెప్పారు. భవిష్యత్‌లో డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ మారబోతోందన్నారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వివరించారు. విద్యుత్ అవసరాలపై హెచ్‌ఎండిఏతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. విద్యుత్‌లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.

2025,-26లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లు

ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు సిఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. గతేడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు. 2025,-26లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సిఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.2034-,35 వరకు (భవిష్యత్ అంచనాలను) డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని అధికారులు సిఎంతో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News