Saturday, May 17, 2025

తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ సేవలు అద్భుతం

- Advertisement -
- Advertisement -

హెల్త్ టూరిజంలో ఏఐ సేవలు ఆశ్చర్యం కలిగించింది
హైదరాబాద్‌లో ఏఐజి హాస్పిటల్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో సుందరీమణుల సందడి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే వైద్య సేవల రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ హెల్త్ టూరిజంను మిస్ వరల్డ్ 2025 పోటీదారులు అభినందించారు. ప్రపంచ స్థాయివైద్య సేవలు(Healthcare services excellent) అందిస్తున్న హైదరాబాద్‌ను కొనియాడారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజి) అందిస్తున్న వైద్య సేవలు(Healthcare services excellent) ఆశ్చర్యం కలిగించిందని కొనియాడారు. హైదరాబాద్ వేదికగా హెల్త్ టూరిజం ఎంతో ఆకట్టుకుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

తమ పర్యటనలో భాగంగా శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజిని సందర్శించారు. అక్కడ వారికి ఏఐజి వ్యవస్థాపకుడు, చైర్మన్ జి.నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలో అందజేస్తున్న ప్రపంచ స్థాయి చికిత్స గురించి వైద్యులు, యాజమాన్యం వారికి వివరింఒచారు. అంతేకాకుండా ఆసుపత్రిలో ఉన్న ఆధునాతన చికిత్స యూనిట్లు, వైద్య పరికరాలు, వాటి పనితీరును స్వయంగా వారంతా తిలకించారు. చికిత్స పొందుతున్న కొందరు రోగులతో మిస్ వరల్డ్ పోటీదారులు వివరాలు, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏఐజి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ మేము అనుభవాలను పంచుకుంటూ నేర్చుకుంటామని, అదే విధంగా మెంటర్షిప్, పరస్పర మద్దతు ద్వారా ఒకరినొకరం నుండి నేర్చుకుంటామని తెలిపారు. చాలాసార్లు కుటుంబాలు, సమాజాల సంరక్షకులుగా ఉన్న మహిళలు, తమ సొంత ఆరోగ్యాన్ని ప్రాముఖ్యంగా పరిగణించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది కేవలం మన కోసం మాత్రమే కాదు, మనపై ఆధారపడి ఉన్న వారి సంక్షేమం కోసం కూడా అవసరమని అన్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని వివరించారు. మామూలుగా గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు హృదయం, మెదడు,మూత్రపిండాల వంటి ప్రధాన అవయవాలపై ఎక్కువ దృష్టి సారించే వారని, ఆధునిక వైద్యపరమైన అభివృద్ధితో ఇప్పుడు ఈ దృక్కోణం మారుతోందని అన్నారు. అనంతరం మిస్ వరల్ పోటీదారులు తమ అభిప్రాయాలను తెలిపారు.

ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో సుందరీమణుల సందడి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కుకి వచ్చిన మిస్ వరల్ పోటీదారులు సందడి చేశారు. ఆ పార్కులో ఉన్న సహజ ప్రకృతి అందాలను చూసి తరించారు. ఎక్స్పీరియం ఎకో-టూరిజం పార్క్ అందాలు ప్రపంచ సుందరీమణుల మనసు దోచుకున్నాయి. మిస్ వరల్ క్రిస్టినా పిష్కోవా, అమెరికా-ఓషియానియా పోటీదారులు ఎక్స్పీరియం ఎకో-టూరిజం పార్క్‌ను శుక్రవారం సందర్శించారు. 250 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్క్, కళ, నవీనత, స్థిరత్వం యొక్క సజీవ సాక్ష్యంగా ఉంది.

ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత గమ్యస్థానంగా ప్రత్యేకత పొందింది. మిస్ వరల్ కంటెస్టెంట్ లకు ఎక్స్పీరియం వద్ద డోల్ వాయిద్యం, గజ్జెలతో సంప్రదాయికంగా స్వాగతించారు. పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఈ సందర్శనలో భాగస్వామ్యమయ్యారు. పార్క్ యొక్క ప్రత్యేక ఆకర్షణలను చూడడానికి పర్యావరణ-స్నేహశీలియైన వాహనాల్లో వారిని తీసుకెళ్లి ప్రదేశాలను చూపించారు. ఈ సందర్శనలో మిస్ వరల్ కంటెస్టంట్లకు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను అధికారులు వివరించారు. ఎక్సపీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

పార్క్ లోని ప్రకృతి సౌందర్యం, హరిత విహార ప్రాంతాలను కంటెస్టంట్లు సందర్శించారు. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను అందించే ప్రదేశం సండౌనర్ పాయింట్ , ప్రకృతి, ఆధ్యాత్మికత యొక్క శాంతియుత సంగమం బుద్ధ ఇన్సైడ్ ట్రీ స్పాట్ , భూగర్భ శాస్త్రపరమైన అద్భుతం, రెడ్ టైల్ ఫార్మేషన్ స్పాట్ , అపూర్వమైన ప్రకృతి ఛాయావృత ప్రదేశం ఓవల్, ఆంబ్రెలా ఆకారపు చెట్టు స్పాట్ , హై-టీ,డిజే సెషన్తో కూడిన రౌండ్ టేబుల్ అమరిక ఈజిప్షియన్ రాక్ స్పాట్‌ను మిస్ వరల్ కంటెస్టెంట్‌లు సందర్శించారు. ఈ సందర్శన, ఎక్స్పీరియం యొక్క ప్రపంచ ప్రాచుర్యాన్ని మాత్రమే కాకుండా, మిస్ వరల్ సంస్థ యొక్క ‘బ్యూటీ విత్ ఎ పర్పస్‘ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ అవగాహన, సంస్కృతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించే ఒక మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News