Saturday, May 17, 2025

శనివారం రాశి ఫలాలు (17-05-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: చికాకు అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయాలలో జాగ్రత్తలు వహించండి. ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది.

వృషభం: తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవవు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు.

మిథునం: ఆర్థిక అభివృద్ధి కొరకు కష్టపడాల్సిన తరుణం. మొండి బాకీలు వసూలు అవుతాయి. పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం: కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.  సంతానం నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

కన్య: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

తుల: రుణాలు చాలా వరకు తీరుస్తారు.ఇకపై రుణాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది.

వృశ్చికం: సంతానం నూతన సాంకేతిక విద్యల పై ఆసక్తి చూపుతారు. పారిశ్రామిక, రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు. వృత్తి,వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి.

ధనుస్సు: కోర్టు వ్యవహారాలు. వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు.

మకరం: అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వపరంగా, వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప ధన లాభం.

కుంభం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకొని అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు.సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు కొనుగోలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News