రెండు గంటల పాటు సమావేశం
తాజా రాజకీయ పరిణామాలు,
బిఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై
ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఉద యం అక్కడకు వెళ్లిన కెటిఆర్ సుమారు రెండు గం టల పాటు సమావేశమయ్యారు. అనారోగ్యంతో ఉన్న హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సుదీర్ఘ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, బిఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత పరిస్తితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో హరీష్‌రావుపై జరుగుతున్న దుష్ప్రచారా న్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.
తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ పగ్గాలు కెటిఆర్‌కు అప్పగిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తానని వివరణ ఇచ్చారు. ఇటీవల ఎంఎల్‌సి కవిత సైతం తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, తన మీద ఎవరు కుట్రలు చేస్తున్నారో తనకు తెలుసు అని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కెటిఆర్, హరీష్ రావుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.