Saturday, May 17, 2025

కంప్యూటర్ యుగంలో కుల బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లా నెక్కొండ
మండలం నాగారంలో
అనాగరికం 10
నెలలుగా 12 కుటుంబాలకు
నరకయాతన
పంచాయితీకి పిలిస్తే
రాలేదని పెద్దమనుషుల
దుశ్చర్య పెళ్లికైనా,
చావుకైనా పిలిచేది లేదు
రూ.2వేల జరిమానా కట్టి
తప్పు ఒప్పుకుంటేనే
కులంలోకి అధికారుల
ఆదేశాలు బేఖాతరు

బి. బాబ్జీ
మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి: ఆ గ్రామ జనాభా సుమారు మూడు వేలు. ఓటర్లు 2,400 మంది. యాదవ సామాజిక వర్గం ప్రాబల్యం గల గ్రామంగా నెక్కొండ మండలంలో పేరున్న ఇక్కడ కుల బహిష్కరణ రక్కసి కోరలు చాస్తోంది. యాదవ కుటుంబా లు 140 వరకు ఉండగా 75 కురుమ, వంద ఎస్‌సి, 70 ఒసి, 50 ముదిరాజ్, 60 గౌడ కుటుంబాలు ఉన్న నాగారం గ్రామాన్ని శుక్రవారం ‘మన తెలంగాణ’ ప్రతినిధి సందర్శించగా నాగరిక సమాజం సిగ్గు పడే విషయాలు వెలుగుచూశాయి. గ్రామంలో 2024, జూలై నాలుగో తేదీ నుంచి 15 యాదవ కు టుంబాలు కులబహిష్కరణ కోరల్లో చిక్కుకుని మానసికంగా వేదనకు గురవుతున్నట్లు తెలిసింది.కుల బహిష్కరణ మూర్ఖపు చర్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీయగా విస్తుపోయే అంశాలు బయటకొచ్చాయి.

2024 జనవరిలో గ్రామంలోని దారపు వెంకటేశ్ ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది. ఈ విషయమై వెంకటేశ్ భార్య తిడుతుండగా ఇంటి పక్కనున్న రామ నర్సమ్మ తమనే తిడుతోందని యాదవ సంఘం పెద్ద మనుషులను ఆశ్రయించి పంచాయితీ పెట్టించింది. ఈ మేరకు పెద్ద మనుషు లు జంగిలి రాములు, శీలం వెంకన్న, బొడ్డు యాదగిరి, వీర స్వామి వెంకటేశ్ దంపతులను పంచాయితీకి పిలిపించారు. అయితే, వ్యవసాయ పనుల ఒత్తిడితో వారు వెళ్ళలేదు. దీంతో తాము పిలిస్తే పంచాయితీకి రారా.. అని వెంకటేశ్ కుటుంబాన్ని పెద్ద మనుషులు కుల బహిష్కరణ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వెంకటేశ్ కూతురు శారీ ఫంక్షన్ జరగగా సదరు నలుగురు పెద్ద మనుషులు యాదవ కుటుంబాలు ఎవరూ వెంకటేశ్ ఇంట్లో భోజనానికి వెళ్లొద్దని కట్టుదిట్టం చేశారు.

ఇదేమీ పట్టించుకోకుండా 15 కుటుంబాలు భోజనానికి వెళ్లగా ఆ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. తమ మాటను ధిక్కరించి కుల బహిష్కరణకు గురైన వాళ్ళ ఇండ్లలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, చావులకు ఎవరూ వెళ్ళవద్దని, వెళ్తే ఆ కుటుంబాలకు కూడా కుల బహిష్కరణ గతే పడుతుందని పెద్ద మనుషులు భయబ్రాంతులకు గురిచేస్తూ కులం కట్టుబాటు పేరుతో అమానుషంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు తమ ఆవేదన చెప్పుకున్నాయి. తప్పు జరిగిందని ఒప్పుకుని 2 వేల రూపాయలు జరిమానాగా కడితే కుల బహిష్కరణ ఎత్తి వేస్తామని ఆంక్షలు పెట్టడంతో మూడు కుటుంబాలు జరిమానా చెల్లించి తప్పయిందని ఒప్పుకోవడంతో మళ్లీ కులం లోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 12 కుటుంబాలు కుల బహిష్కరణలో ఉన్నాయి.

కౌన్సెలింగ్ ఇచ్చినా మారని పెద్ద మనుషులు

బాధితుడు దారపు వెంకటేశ్ ఈ ఏడాది జనవరి 30న అప్పటి వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝాకు ఫిర్యాదు చేయగా అధికారులు రంగంలోకి దిగారు. అప్పటి నర్సంపేట ఎసిపి కిరణ్ కుమార్, తహసీల్దార్, నెక్కొండ సిఐ, ఎస్‌ఐ నాగారాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. గ్రామంలో పోలీస్ జాగృతి కళా బృందంతో ప్రదర్శనలు ఇప్పించారు. పెద్ద మనుషులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సదరు పెద్ద మనుషులు బుద్ధిగా ఉంటామని అప్పుడు తలలూపారు.

అధికారులు వెళ్ళాక మళ్ళీ పెద్ద మనుషుల బరి తెగింపు మొదలైందని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ అండతోనే పెద్ద మనుషులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. కుల సంఘం పెద్దలు ఇదేనా చేసేది?. దారపు వెంకటేశ్ (బాధితుడు ) కుల సంఘం పెద్దలు సమస్యలు పరిష్కారించాలి కానీ పెంచుతున్నారు. ఊ రిలో బంధువుల ఇంట్లో పెళ్లిళ్లు, చావులకు రానీయడం లేదు. కుల బహిష్కరణ చేశామని పది నెలలుగా మా కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నారు. దహన సంస్కారాలకు, శుభకార్యాలకు రాకుండా అడ్డు కుంటున్నారు.

నా తండ్రితో విడదీశారు

(వెంకటేశ్వర్లు, బాధితుడు)

పెద్ద మనుషులు నా తండ్రి సోమయ్యను పదేళ్ల క్రితం కులం నుంచి బహిష్కరించారు. నా తండ్రి నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరైనా నన్ను కులబహిష్కరణ చేస్తామంటున్నారు. అధికారులే న్యాయం చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News