Saturday, May 17, 2025

తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండ్రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిస్తాయని సూచన చేసింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రేపు ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక, ఎపిలోనూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది విజయవాడ వాతావరణ కేంద్రం. ఇవాళ అల్లూరి, విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News