ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర కటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి కొన్నేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ కోహ్లి గుడ్‌బై చెప్పేయడం సర్వత్రా చ ర్చనీయాంశంగా మారింది. టెస్టుల్లో తనకు తిరిగి కెప్టెన్సీ అప్పగించాలని కోహ్లి బిసిసిఐ పెద్దలను కోరాడు. ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లి ఈ విషయాన్ని బిసిసిఐ దృష్టికి తీసుకెళ్లాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బిసిసిఐ కూడా సారథ్య బాధ్యతలు అప్పగిస్తామని కోహ్లికి హా మీ ఇచ్చినట్టు సమాచారం. కానీ ఉన్నట్టుండి ఈ విషయంలో బిసిసిఐ తన వై ఖరీని మార్చుకుంది. జట్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని యు వ ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ సిరీస్‌లో తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే నమ్మకంతో ఉన్న కోహ్లికి బిసిసిఐ పెద్దలు మొం డిచెయ్యి చూపడంతో అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వెల్తువెత్తాయి.
గతంలో కోహ్లి సారథ్యంలో టీమిండి యా టెస్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లి కెప్టెన్సీ నుంచి తనంతట తానే తప్పుకుని రోహిత్‌కు సారథ్య బాధ్యత లు అప్పగించాలని బిసిసిఐకి సూచించాడు. అతను చెప్పినట్టే బిసిసిఐ రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగించాలని కోహ్లి బిసిసిఐ పెద్దలను కోరాడు. ప్రస్తుతం జట్టులో అందరూ జూనియర్లే ఉన్నారని వారి సారథ్యంలో తాను ఆడలేనని, తనకే పగ్గాలు ఇవ్వాలని కోరాడు. కానీ దీనికి బిసిసిఐ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో టెస్టులకు వీడ్కోలు పలకడమే మంచిదని భావించినట్టు తెలిసిందే. అయితే ఈ విషయంలో బిసిసిఐ నుంచి కానీ, కోహ్లి నుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు.