Saturday, May 17, 2025

ముంబై టీమ్‌లో బెయిర్‌స్టో

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా జరిగే మి గిలిన మ్యాచుల కో సం ముంబై ఇండియన్స్ జానీ బెయిర్ స్టో,(Jonny Bairstow రిచర్డ్ గ్లీసన్‌ల ను జట్టులోకి తీసుకొంది. ర్యాన్ రికెల్టన్, వి ల్ జాక్స్ స్థానాల్లో వీరు జట్టులోకి రానున్నారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, భారత్, పాకిస్థాన్ దే శాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపిఎల్‌ను అ ర్ధాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిం దే. ఇరు దేశాల మధ్య స యోధ్య కుదిరి ఉద్రిక్తలు తొలగి పోవడంతో శనివారం నుంచి ఐపిఎల్ పునఃప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ తిరిగి ప్రారంభమవుతున్నా కొంత మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి స్థితిలో ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నాయి. తా జాగా ముంబై టీమ్ బెయిర్‌స్టో, రిచర్డ్‌లకు చోటు కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News