Sunday, May 18, 2025

ప్రజలకు ఎలా మేలు చేస్తున్నామనేది నేతలు ఆలోచించాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో డిపిఆర్ ను పూర్తి స్థాయిలో కేంద్రానికి పంపలేదని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం చెబుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లుగా గోదావరి-కృష్ణా నుంచి ఒక్క చుక్క అదనపు నీరు రాలేదని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మెట్రో డిపిఆర్ సమగ్రంగా పంపిస్తే కేంద్రం ఆలోచిస్తుందని తెలియజేశారు. ప్రజలకు ఎలా మేలు చేస్తున్నామనేది నేతలు ఆలోచించాలని సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News