Sunday, May 18, 2025

దౌత్య యుద్ధానికి దండు రెడీ

- Advertisement -
- Advertisement -

ఎంపిలతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు పాకిస్తాన్
ఉగ్రచర్యలు, ఆపరేషన్ సిందూర్‌పై వివిధ దేశాల అధినేతలకు
వివరించడమే లక్షం శశిథరూర్, రవిశంకర్‌ప్రసాద్,
సంజయ్‌కుమార్ ఝా, బైజయంత్ పాండా, కనిమొళి, సుప్రియ
సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండేల నాయకత్వంలో బృందాలు
22 నుంచి విదేశాల్లో పర్యటించనున్న ఎంపిలు మజ్లిస్ నుంచి
అసదుద్దీన్ ఒవైసీకి చోటు రాహుల్ ప్రతిపాదిత పేర్లు బుట్టదాఖలు

న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర తరువాతి క్ర మంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బహుళ పార్టీల ఎంపిల ప్రతినిధి బృందాలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అంతర్గత తర్జనభర్జనల తరువాత అన్ని పార్టీలకు చెందిన కొందరు ఎంపిలతో కూడిన ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఎంపిక చేసింది. ఈ ఏ డు బృందాలను ఎంపిక చేసుకున్న ప్రధాన దేశాలలో పర్యటనలకు పంపిస్తుంది.ఏడు బృందాలకు ఏడుగురు ఎంపిలు నాయక త్వం వహిస్తారు. ఏడు బృందాలకు వేర్వేరు గా సారధ్యం వహించే ఈ ఎంపిలు వీరే ః 1 కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ నాయకత్వపు బృందం, 2 బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వపు టీం. 3) జెడియు ఎంపి సం జయ్ కుమార్ ఝా సారధ్యపు బృందం. 4) బిజెపి ఎంపి భయ్‌జయంత్ పాండా ఆధ్వర్యంలో మరో బృందం, 5)డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధి నాయకత్వపు బృందం 6) ఎన్‌సిపి ఎంపి సుప్రి యా సూలే సారథ్యపు బృందం,7) శివసేన ఎంపి శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే సారధ్యపు బృందాలు పర్యటనలకు వెళ్తాయి.

పాకిస్థాన్ ఉగ్ర చర్యలను అనేక దేశాలకు వివరించడం, అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఎం డగట్టేందుకు భారత ప్రభుత్వం ఈ బృందాలను వచ్చే వారం నుంచి పంపిస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంపిక చేసిన ఏడు బృందాలు, ఇందులో ఉన్న ఎంపిల పేర్లు ఇప్పటి ప్రకటనలో తెలియచేశారు. ఏడు అఖిలపక్ష బృందాలు పదిరోజుల పాటు పలు దేశాలలో పర్యటిస్తాయి. ఈ నెల 22 నుంచి ఈ బృందాల పర్యటన ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రతినిధి బృందాలు సౌదీ అరేబియా, కువైట్, బహరైన్, అల్జీరియా ఒమన్, కెన్యా , దక్షిణాఫ్రికా , ఈజిప్టులలో పర్యటిస్తాయి.ఇక మరో బృందం జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా , మలేసియా, ఇండోనేసియాలకు వెళ్లుతుంది. ప్రతినిధిబృందాలలో హైదరాబాద్‌ఎంపి అసదుద్దిన్ ఒవైసి, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనిష్ తివారీ, అనురాగ్ ఠాకూర్ వంటి పలువురు ఎంపిలు కూడా ఉంటారు. ఉగ్రవాదం ఏరివేతకు భారతదేశం జాతీయ స్థాయిలో పూర్తి ఏకాభిప్రాయంతో వ్యవహరించింది.

రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్పందన ఉంటుందని , బృందాల ఎంపిక ఇతర వివరాలను ఓ ప్రకటనలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది.నిర్థిష్ట రీతిలో మాట్లాడగలిగే వారు. దేశ సమగ్ర విధానాన్ని వేదికల ద్వారా చాటి చెప్పగలిగే వారిని గమనించి వడబోతల తరువాత బృందాల్లోకి తీసుకున్నారని వెల్లడించారు. ఇక ప్రతినిధి బృందంలో అధికార ఎన్‌డిఎ నుంచి నలుగురు, ఇండియా కూటమి నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీల ఎంపిలే కాకుండా ఈ టీంలలో ప్రముఖ దౌత్యవేత్తలు కూడా ఉంటారు. అత్యంత కీలక విషయాలు , ప్రత్యేకించి జాతీయ భద్రతా , సమగ్రత సమైక్యత వంటి విషయాలలో భారత్ అంతా కలిసికట్టుగా ఉంటుంది. ఉగ్రవాద వ్యతిరేక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ప్రకటిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ స్పందించారు. విభేదాలకు తావు లేని రీతిలో రాజకీయాలకు , పార్టీల విధానాలకు అతీతంగా ఇప్పుడు మరో సారి జాతీయ ఐక్యత ప్రతిఫలించిందని తమ మంత్రిత్వశాఖ తరఫు ప్రకటనను మంత్రి వెలువరించారు.

ఏ దేశం వెళ్లినా ఈ బృందం ద్వారా వెలిబుచ్చే సందేశాలు , పలువురు నేతలతో వారి చర్చలు, ప్రజలతో మమేకం కావడం వంటి విషయాలను ప్రపంచ వ్యాప్తంగా బలీయరీతిలో విన్పించేందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే , అంతర్జాతీయ ఆర్థిక , ద్రవ్య సంస్థల నుంచి భారీ స్థాయిలో సాయం తీసుకునేందుకు పాకిస్థాన్ పలు రకాలుగా దౌత్య యత్నాలకు దిగడం , ఐఎంఎఫ్ నుంచి ఇప్పటికే పాకిస్థాన్‌కు భారీ స్థాయి ఆర్థిక సాయం అందిన దశలో దీనిని అడ్డుకునేందుకు ఇప్పుడు ఈ భారతీయ ప్రతినిధి బృందాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్థాన్ కీలక పాత్ర పలు సందర్భాల్లో రుజువు అయిన దశలో ఇప్పటికీ ఈ దేశానికి భారీ స్థాయి నిధులు అందడం చివరికి మనకు మనమే ఉగ్రవాద గోతిలో పడటమే అవుతుందని భారత దౌత్య వర్గాలు ఇప్పటికే అంతర్జాతీయ వేదికల్లో చాటిచెపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News