Sunday, May 18, 2025

ఉద్యోగుల సమస్యలపై బిఆర్‌ఎస్ సమరశంఖం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ
ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, పలు ఉద్యోగ సంఘాల
ప్రతినిధులతో కెటిఆర్, హరీశ్‌రావు సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల (Employee issues) పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నిర్ణయం తీసుకుంది. ప్ర ధాన ప్రతిపక్షంగా, లక్షల మంది ఉ ద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల కు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బిఆర్‌ఎస్ పేర్కొంది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హ రీష్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘా ల నాయకులు(Employee issues), రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో శనివారం హరీష్‌రావు నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ రూపొందించేందుకు చర్చలు జరిగాయి.

గత 18 నెలల్లో రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభు త్వం నెరవేర్చకపోవడం, డి. ఎ బకాయిలు, పిఆర్‌సి వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా సకాలంలో అందించకుండా సతాయించడం, ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తు న్న ఉద్యోగుల పైన వివిధ రకాలుగా ఒత్తిడి తేవడం వంటి అంశాలను పార్టీలోని మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఈ సమావేశానికి హాజరైన ఇతర నాయకులు కెటిఆర్, హరీష్ రావుల దృష్టికి  తీసుకువెళ్లారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధాప్యంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పడుతున్న ఇబ్బందులపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కులు, ఆకాంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. ఈ సందర్భంగా కెటిఆర్, హరీష్ రావు మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ ఎల్లవేళలా ఉద్యోగుల ఆకాంక్షలు, హక్కుల పట్ల సానుభూతితో ఉంటుందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం అనంతరం, ఉద్యోగుల ఆకాంక్షల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇందు లో భాగంగా, ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నేతలకు మద్దతుగా నిలవాలని, పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల మాజీ నా యకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను ఈ కార్యక్రమంలో కలుపుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా, ఉద్యోగులకు అండగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరిస్తామని బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News