- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిధిలో ప్రమాదం జరిగింది. బాలమువారిపల్లి వద్ద కారు బావిలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ప్లేటు ఆధారంగా కర్నాటకదిగా గుర్తించినట్టు సమాచారం.
- Advertisement -