Sunday, May 18, 2025

పెన్షన్…. రూ.10 వేల లంచం కోసం తాకట్టు పెట్టిన చెవి పోగులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నటుడు, ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ ఇలాకాలో పింఛన్ కావాలంటే లంచం ఇవ్వాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. హిందూపూర్‌లో లంచం ఇవ్వడానికి ఓ మహిళ తన చెవి పోగులను తాకట్టు పెట్టింది.  మోడల్ కాలనీలో పింఛన్ మంజూరు చేయడానికి సచివాలయం అధికారులు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారని బాధితురాలు పేర్కొంది. లంచం ఇవ్వడానికి డబ్బుల కోసం మహిళ తన చెవి పోగులను బంగారు దుకాణంలో తాకట్టు పెట్టానని వీడియోలో వివరించింది. ఎపి వ్యాప్తంగా పెన్షన్ కోసం లంచం ఇవ్వాల్సి వస్తుందని వృద్ధులు ఆరోపణలు చేస్తున్నారు. పెన్షన్ కూడా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇవ్వడంతో పాటు డైరెక్ట్ గా బ్యాంక్ ఎకౌంట్ లోనే డబ్బులు పడితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డాకు మహరాజ్ ఎక్కడ తన రాజ్యం లో ప్రజలు కష్టపడుతున్నారని రాకేశ్ అనే నెటిజన్ ప్రశ్నిస్తున్నారు. లంచం, లంచం… ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాధికారులు పేదల రక్తం తాగుతారు? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ చండాలం మాత్రం ఆపలేకపోతున్నారు. ఈ విధంగా చూస్తే నేరుగా వారి అకౌంట్లలో వేయడం సరైనదే అనిపిస్తోందని వాసు కరే అనే నెటిజన్ వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News