Sunday, May 18, 2025

ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య జరిగే డ్రామా

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం.(Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా.జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. భైరవం మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-గరుడన్ కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ ఉండడంతో ఈ సినిమాను ఓకే చేశాను. ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో వుంటుంది.

క్యారెక్టరైజేషన్ నా స్టైల్‌లో ఉంటుం ది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు. ప్రారంభంలో ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమవుతుందేమో అనుకున్నాను. అయితే ఈ ముగ్గురు కూడా ఆఫ్ స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు. 14 రోజుల పాటు రాత్రి మొత్తం వర్క్ చేశాము. దాదా పు 900 మంది సెట్స్‌లో ఉండేవారు. అ అపోర్షన్ షూట్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. -నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇం కొంచెం జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య జరిగే డ్రామా. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత కావాలో అంతే పెట్టాం. ముగ్గురి క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి. -కథ నుంచి వచ్చిన టైటిల్ భైరవం. సినిమాలో చిన్న ఆధ్యాత్మిక టచింగ్ ఉంటుంది. ఒక గ్రామంలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి భైరవం అని టైటిల్ పెట్టాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News