Sunday, May 18, 2025

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం… 9 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పాతబస్తీలోని మీర్‌ చౌక్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (fire accident Old city) చోటుచేసుకుంది. గుల్జార్‌హౌస్‌ సమీపంలో ఓ భవనంలో ఎసి కంప్రెసర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.ఈ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడంతో భవనంలో (fire accident Old city) చిక్కుకున్నవారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని ఉస్మానియా ఆసుపత్రి, కంచన్ బాగ్ డిఆర్డిఒ ఆస్పత్రి, మలక్ పేట్ యశోద ఆసుపత్రికి, హైదర్ గూడా అపోలో ఆస్పత్రులకు తరలించారు. భవనంలో 30 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. మూడు అగ్నిమాపక యంత్రాలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News