Monday, May 19, 2025

ఛీ ఛీ నడిరోడ్డుపై అవేం పనులు… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యం మత్తులో ఓ జంట నడి రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎన్ఎచ్-16 రహదారిలోని రామలింగేశ్వర నగర్ ఫ్లైఓవర్ పై ఓ యువకుడు బైక్ పై యువతి ముందు కూర్చొ పెట్టుకొని డ్రైవ్ చేశాడు. బైక్ పై ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని అసభ్యంగా ప్రవర్తించారు. యువతి పెట్రోల్ ట్యాంక్‌ పై కూర్చుని సదరు యువకుడిని కౌగిలించుకుని ముద్దుల వర్షం కురిపించడంతో పాటు రొమాన్స్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువతి, యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. రోడ్లపై యువతి యువకులు శృతి మించి ప్రవర్తించడం మంచిది కాదని స్థానికులు హితువు పలికారు. వాళ్లకు లేని సిగ్గు మనకెందుకు, బ్లర్ ఎందుకు చేశారని, వాళ్ల గొప్పతనం తల్లిదండ్రులకు చేరే వరకు షేర్ చేయాలని వెన్నెల్లో ఆడపిల్ల అనే నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి వీడియోలు పెట్టి మద్యం ప్రియుల కడుపులు కొట్టకండని వాళ్లు మంచిగా ఉంటేనే ఎపి ఆరోగ్యం బాగుంటుందని, ఇలాంటివి పోస్టు చేయకండని జగన్ అనే నెటిజన్ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News