హైదరాబాద్: ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాతబస్తీ మైలార్ దేవులపల్లిలో అగ్ని ప్రమాదం ఉదయం 6 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమని, ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయ చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫైర్ సిబ్బందికి పరికరాలు ప్రభుత్వం అందించాలని, అగ్ని మాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన శిక్షణ ఇవ్వాలని కోరారు.
అగ్నిమాపకశాఖ..సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని, బాధితులకు కేంద్రం తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తామని చెప్పారు. బాధితులకు ఆర్థిక సాయం అందేలా ప్రధానితో మాట్లాడతానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మృతులు ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా(7), రాజేంద్రకుమార్( 67), సుమిత్ర( 65), మున్నీ భాయ్ (72), అభిషేక్ మోదీ( 30), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇదిక్కి మోదీ, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, రజని అగర్వాల్, రిషభ్, వ్రతం అగర్వాల్, ఫ్యాన్సీ అగర్వాల్ గా గుర్తించారు.