- Advertisement -
హైదరాబాద్: ప్రమాద స్థలం నుంచి కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని ఫైర్ డిజి నాగిరెడ్డి (DG Nagireddy) తెలిపారు. సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనడం అవాస్తవం అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఫైర్ డిజి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ దగ్గర అత్యాధునిక పరికరాలు లేదనడం సరికాదని నాగిరెడ్డి విమర్శించారు. ఉదయం 6:16కు కాల్ వచ్చిందని, వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని డిజి తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని, మంటల్లో చిక్కుకున్న 17 మందిని రక్షించాం అని తెలియజేశారు. అడ్వాన్స్ డ్ ఫైర్ రోబోట్ ఆపరేషన్ లో ఉపయోగించామని, మంటలను 2 గంటల్లో అదుపు చేశామని ఫైర్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని నాగిరెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -