Monday, May 19, 2025

రాణించిన నేహల్, శశాంక్.. రాజస్థాన్‌కు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో(Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ పవర్‌ప్లే‌లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. నేహాల్ వదేరాతో కలిసి రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదురుకున్నారు. ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ దశలో రియాన్ పరాగ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(30) ఔట్ అయ్యాడు.

కానీ నేహల్ మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతను అర్థశతకం కూడా నమోదు చేశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు బ్యాటింగ్‌కి వచ్చిన శశాంక్ సింగ్‌ కూడా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 30 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సులతో 59 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్‌లో తుషార్ 2, మఫాకా, పరాగ్, మధ్వాల్ చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News