షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి, ఉద్దమ్మగడ్డలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి 50మందిని కాపాడారు. ఇందులో 16మంది చిన్నారులు ఉన్నారు. ఉద్దమ్మగడ్డలో ఉన్న మూడంతస్తుల భవనంలో షార్ట్‌సర్కూట్ రావడంతో ఒక్కసారిగి మంటలు ఎగసిపడ్డాయి. వాటిని గమినించిన భవనంలో ఉంటున్న
వారు భయాందోళనకు గురై భవనంపైకి ఎక్కారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న 50మందిని భవనం నుంచి కాపాడి కిందికి తీసుకుని వచ్చారు. ఫైర్ సిబ్బంది కాపాడిన వారిలో 16మంది చిన్నారులు ఉన్నారు. భవనంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటన్నరపాటు శ్రమించారు. షార్ట్ సర్కూట్ వల్లే మూడంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.