Monday, May 19, 2025

సంపులో పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

రెండున్నర సంత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల… ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల కళ్యాణ్, జ్యోతిలు కుటుంబ సభ్యులతో కలిసి మియాపూర్ లోని స్టాలీన్ నగర్ కాలనీలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కళ్యాణ్, జ్యోతి దంపతులకు కె. ప్రణీత్ కుమార్(రెండున్నర సంవత్సరాలు) ఉన్నాడు. కళ్యాణ్ స్థానికంగా వ్యాపారం చేస్తూ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదిన మద్యాహ్నం 2:30 గంటల సమయంలో కళ్యాణ్, జ్యోతి ఇంట్లో ఉండగా కుమారుడు. ప్రణీత్ ఇంటిముందు ఆడుకుంటూ ఉన్నాడు.

సుమారు 3 గంటల సమయంలో కళ్యాణ్, బయటకు వచ్చి కుమారుడు ప్రణీతన్ను చూడగా కనిపించలేదు. చుట్టుప్రక్కల అంతా వెతికి ఇంటిముందు ఉన్న సంపులో చూడగా చిన్నారి ప్రణీత్ సంపులో పడి ఉన్నాడు. వెంటనే చిన్నారి ప్రణీత్ను సంపులో నుండి తీసుకుని దగ్గర్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రణీత్ మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి ప్రణీత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడడంతోనే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు చిన్నారి తండ్రి కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News