Monday, May 19, 2025

న్యూయార్క్‌లో నౌకా ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరోసారి ఘోరమైన నౌకా ప్రమాదం జరిగింది. ప్రపంచవ్యాప్త సృహద్భావ యాత్రకు బయలుదేరిన మెక్సికన్ నౌక న్యూయార్క్‌లోని బ్లూక్లిన్ బ్రిడ్జి ని ఎత్తు కావడంతో బలంగా తగిలింది. నగరంలో మధ్య నుంచి ప్రవహించే ఈస్ట్ నది పై ఈ వంతెన ఉంది.ప్రమాద ఘటనతో తీవ్రంగా గాయపడ్డ నలుగురిలో నౌకా యాన సిబ్బందిలోని ఇద్దరు మృతిచెందారు. ఇక నౌక ప్రాచీనమైన వంతెన పైకప్పుకు తగిలి గాలిలో వేలాడిన స్థితిలో ఉంది. దీనితో ఇందులోని జనం గావుకేకలు పెట్టారు. తరువాత స్థానిక సహాయ బృందం వచ్చి రక్షించింది. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్ ఘటన గురించి తెలిపారు. 142 ఏండ్ల క్రితం కట్టిన ఈ బ్రిడ్జి ఇప్పుడు నౌకా తాకిడితో పెద్దగా ముప్పు లేకుండా నిలబడిందని అయితే ఇద్దరు మృతి చెందారని, 19 మందిని చికిత్సలకు తరలించారని వెల్లడించారు.

చాలా ఎత్తుగా ఉండే ఈ నౌకలో ఘటన దశలో 277 మంది ఉన్నారు. కాగా మొదటి రెండు అంతస్తులు బ్రిడ్జికి తగిలి పాడయ్యాయి. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ? కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉందని మేయర్ చెప్పారు. నౌక బ్రిడ్జిని ఢోకొనడం, కొంత భాగం గాలిలో తేలియాడుతూ ఉన్న దృశ్యాలు స్థానిక సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. బ్రూక్లిన్ ప్రాంతంలోని ఈ బ్రిడ్జి వద్ద నౌక అతి వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్థారించారు. ఘటన తరువాత ఇక్కడ జలమార్గంలోనూ , రోడ్లపై కూడా చాలా సేపటి వరకూ ట్రాఫిక్ స్తంభించింది. నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాలతోనే ఇది ఆగకుండా ముందుకు సాగి బ్రిడ్జికి తట్టుకుని నిలిచిందని అధికారులు తొలి దశలో నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News