Monday, May 19, 2025

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇద్దరు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పన్నిన భారీ ఉగ్రవాద కుట్రను తెలంగాణ, ఆంధ్ర ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి భగ్నం చేశారు. నగరంలో విధ్వంసాలకు కుట్ర చేసిన ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలు విజయనగరానికి చెందిన సిరాజ్- ఉర్ -రెహ్మాన్ (29), సికింద్రాబాద్‌లోని బోయిగూడకు చెందిన సయీద్ సమీర్ (28) లను ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడుకు విని యోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుల్లో ఒకరి తండ్రి పోలీసు అధికారిగా తెలు స్తోంది. ఇద్దరు ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇద్దరు కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలను సేకరించి విజయనగరంలో డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు.

అది విజయవంతం కావడంతో ఇద్దరూ పేలుళ్లు అమలు చేయాలనుకున్నారు. ‘హైదరాబాద్ వారి జాబితాలో ఉందో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు‘ అని ఆయన అన్నారు. ఇద్దరు ఐఎస్ ఐఎస్ కార్యకర్తల ప్రయత్నాలను అడ్డుకోవడానికి దారి తీసిన పరిస్థితుల క్రమాన్ని వివరిస్తూ, సిరాజ్, సమీర్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా సంప్రదించి ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాల గురించి సంభాషించడం ప్రారం భించారని ఆ అధికారి వెల్లడించారు. తమలో తాము నమ్మకం పెంచు కున్న తర్వాత ఇద్దరూ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, వారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించి, విజయనగరంలోని ఒక ఏకాంత ప్రదేశంలో ట్రయల్ నిర్వహించారు. పేలుడు ప్రయోగం విజయవంతం కావడంతో సిరాజ్, సమీర్ ‘ఏదో పెద్దది‘ చేయాలని ఒక పథకం వేస్తు న్నా రు. సౌదీ అరేబియాలో ఒక హ్యాండ్లర్ సహాయంతో వారు పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారు.

వాస్తవానికి, హ్యాండ్లర్ సిరాజ్, సమీర్‌లను పేలుళ్లు జరపడానికి ఆదేశించినట్లు తేలింది. ‘ఐఎస్‌ఐఎస్ కార్య కర్తలు పేలుళ్లు జరప డానికి ప్లాన్ చేస్తున్న ఖచ్చితమైన ప్రదేశాలు మాకు ఖచ్చితంగా తెలి యవు‘ అని అధికారి వెల్లడించారు. పోలీసు బృందాలు మొదట విజయ నగరంలోని సిరాజ్ ఇంటిపై దాడి చేసి, అతని సమాచారం ఆధారంగా సమీర్‌ను అదుపులోకి తీసుకుంది. ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన తర్వాత పేలుడు పదార్థాలను ఎక్కడి నుండి సేకరించారో, బాంబు పేలుడును ప్రేరేపించడానికి వాటిని సమీకరించే నైపుణ్యాలను వారు ఎలా పొందారో తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News