Monday, May 19, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం నంద్యాల జిల్లాలోని ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News