Monday, May 19, 2025

తాజా కితాబ్

- Advertisement -
- Advertisement -

చిలుకూరి రామ ఉమా మహేశ్వర శర్మతో
మెహఫిల్ టీం మూడు ప్రశ్నలు.
తెలుగు కథా ప్రపంచంలోకి పెను కెరటంలా నిశ్శబ్దంగా దూసుకువచ్చారు. కథలు రాయాలి అన్న ఆసక్తి, సాహిత్య అభిలాష ఎలా కలిగింది మీకు?
పదో తరగతి వరకు డొక్కశుద్ధి, అంకితభావం, అపార ప్రేమ గల టీచర్ల భిక్షే సాహిత్యాభిలాషకి పునాది. డిగ్రీ పరీక్షలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయన్నా సరే ఓ poem (Rape of the Lock)ని ఎలా చదవాలో ఇరవై ఏడు రోజు ల పాటు చెప్పిన జె.కోటేశ్వరరావు గారిది గోడ భాగం. భావం కంటే భాషకి ప్రాధాన్యం, అం దునా కొంత ఇంగ్లీష్‌కి, తద్వారా ప్రపంచ సాహిత్యానికి గవాక్షం పైకప్పు అనొచ్చేమో. అప్పుడప్పు డు కొన్ని కవితలు. మా జీవన కథ ‘నేనూ శాంత కూడా’ తర్వాత కథల్లోకి దింపింది ఖదీర్ బాబు గారు. కవిత ప్లస్ కథని ‘కథిత’ అనేసుకుని రాసుకున్నవి ఈ కథలు.

మీ కథా సంకలనంలోని దాదాపు అన్ని కథలు మంత్ర నగరి సరి హద్దులు దాటి, సున్నితం, వ్యక్తిగతం, నిషేధము, అతి రహస్యం అని మాట్లాడడానికి, చూడడానికి, కొంతవరకు రాయడానికి సంకోచించే లైంగికత్వం, సోషల్లీ కన్‌స్ట్రక్టెన్ విలువల డొల్లతనం చెప్పాయి. రచయితల్ని ఎంత కాదనుకున్న అప్పుడు, ఒక సెల్ఫ్ సెన్సార్‌షిప్ వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిమితులు అధిగ మించగలి గారా మీరు? రాయడంలో మీకు కలిగిన ఇబ్బంది ఏమైనా ఉందా?
అందరం అన్నీ చెప్పాలనుకుంటాం, కానీ.. చెప్పలేం. ఇది నిజం అని నమ్మిన తర్వాత కూడా కొంత ఊగిసలాట తప్పదు.

Cultural sensitivitiesని కథనం సరిహద్దు ల్ని బేరీజు వేసుకోవాల్సి వచ్చింది కూడా. ఓ క్షణం ఆగి, తర్కించి, -శాంతతో, మిత్రులతో- ముందడుగెయ్యాల్సొచ్చింది. ఆ క్రమంలో పిల్ల మెడలో కట్టిన గంట గణగణలే ఈ కథల్లో కొన్ని.
మీరు కథను చెప్పే పద్ధతిలో ఒక నూతనత్వం, బ్రెవిటీ వుంది. మీరు ఎంచుకున్న ఈ కథా శిల్పం, టెక్నిక్ వల్ల చాలా పెద్ద కాన్వాస్ వున్న కథల్ని కూడా మీరు క్లుప్తతను సాధించగలిగారు అనిపిస్తుంది. మీరు ఏమంటారు?
ఓ విధంగా ఈ శైలిని ‘braided narrative’ అనొచ్చేమో! కథ కాలానికి, ప్రాంతానికి, పాత్రలకి అతీతంగా ముందుకి వెనక్కి పరిగెడుతూనే ఏకసూత్రతని, ఓ cohesive wholenessని సాధించే ప్రయత్నం. ఆ క్రమంలోనే వచ్చినదేమో మీరన్న బ్రెవిటీ, ‘the soul of wit’!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News