Monday, May 19, 2025

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ములుగు జిల్లా  తాడ్వాయిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం మలుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని చెట్టుపెల్లి శ్వేత(40), నూగ దుర్గ(38)లుగా గుర్తించారు. ట్రాక్టర్‌ మేడారం వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News