బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం (Bhairavam) టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆరట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కథాంశం గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుంది.
కమర్షియల్ వాల్యుస్‌తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఆసక్తికరంగా చూపించారు. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శివ తాండవం సీక్వెన్స్, చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో అద్భుతంగా కనిపించారు. మంచు మనోజ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కట్టిపడేశారు. నారా రోహిత్ కూడా తన పాత్రను పవర్‌ఫుల్‌గా పోషించి ఆకట్టుకుంటారు.