Tuesday, May 20, 2025

ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ (Travis Head)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరీ వెల్లడించారు. ప్రస్తుతం ట్రావి స్ హెడ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు తెలిపాడు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 తాత్కాలికంగా వాయిదా పడింది. దాంతో ట్రావిస్ హెడ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అక్కడ హెడ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మ్యాచ్ జరగాల్సి ఉంది. కొవిడ్ బారిన పడటం వల్ల ప్రస్తుతం హెడ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాడని.. ఈ మ్యాచ్‌కు అందుబాటు లో ఉండడం లేదని డేనియల్ వెట్టొరీ తెలిపా డు. మిగిలిన మ్యాచ్‌లలో ఆడతాడా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News