- Advertisement -
హైదరాబాద్: ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఫెయిల్ అయిన వాళ్లు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. మరికొందరైతే.. హీరోలుగా సక్సెస్ రాకపోవడంతో.. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు అని టాక్ నడుస్తోంది. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ (Jayakrishna) త్వరలోనే హీరోగా (Hero) ఎంట్రీకి అంతా రెడీ అయిందట.
‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జయకృష్ణ ఫోటోషూట్‌లో కూడా పాల్గొన్నారట. యాక్టింగ్‌తో పాటు ఇతర అంశాలపై ఆయన శిక్షణ తీసుకున్నారని సమాచారం.
- Advertisement -