- Advertisement -
అమీన్‌పూర్: కారు డ్రైవింగ్ నేర్చుకొనే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఓ చిన్న నిర్లక్ష్యమైనా.. అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది. అలాంటి దారుణమైన ఘటనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న మైదానంలో ఓ యువతి కారు నేర్చుకుంటుంది (Car Learning). ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను సదరు యువతి కారుతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (Accident) పదేళ్ల మణివర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పద్నాలుగేళ్ల ఏకవాణికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఏకవాణిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
- Advertisement -