- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Report) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు(Rains), మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. సోమవారం కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తర వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గింది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.
- Advertisement -