- Advertisement -
ముంబై తూర్పు శివారులోని కాలువలో పడిన ఓ ఎనిమిదేళ్ల అమ్మాయిని కాపాడుతూ 28 ఏళ్ల వ్యక్తి మరణించాడని పోలీసులు సోమవారం తెలిపారు. ఘట్కోపర్‌లోని రమాబాయ్ నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని ఆ పోలీసు అధికారి తెలిపారు. పడిపోయిన బంతిని తీసుకోవడానికి అమ్మాయి కాలువలోకి దిగి అందులో చిక్కుకుపోయింది. ఆమెను కాపాడేందుకు రోజువారీ వేతనం కార్మికుడు షెహజాద్ షేక్ కాలువలోకి దూకాడు.
షేక్ ఆ అమ్మాయిని పట్టుకుని మరో వ్యక్తికి అప్పగించాడు, కానీ తర్వాత బురద, వ్యర్థాలలో చిక్కుకుని మునిగిపోయాడు. పోలీసులు, అగ్నిమాపక దళం వారు అతడిని కాలువ నుంచి పైకైతే తెచ్చి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ డాక్టర్లు ఆయన అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నివేదిక(ఎడిఆర్) నమోదుచేశారని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.
- Advertisement -