Tuesday, May 20, 2025

టార్గెట్ యోగాడే

- Advertisement -
- Advertisement -

భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు సిరాజ్,
సమీర్ కుట్ర రక్తపాతం సృష్టించడమే
లక్షం ఐసిస్ సౌదీ హ్యాండ్లర్ నుంచి
ఆదేశాలు బాంబుల తయారీ
ముడిపదార్థాలు అమెజాన్‌లో ఆర్డర్
సిరాజ్, సమీర్‌తో పాటు టీమ్‌లో కర్నాటక,
మహారాష్ట్ర యువకులు రిమాండ్
రిపోర్టులో కీలకాంశాలు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూ లాలు ఉండటం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో పో లీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ తో పాటు టీమ్‌లో కర్నాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు టీంలో ఉండటంతో ఇన్‌స్టాగ్రా మ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. నిందితులు ఆరుగురు గ్యాంగ్ హైదరాబాద్‌లో మూడ్రోజుల పాటు కలిసి ఉన్నారు. ఐఎస్‌ఐఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై సమావేశమై చర్చించేవారు. టిఫిన్ బాక్స్ బాం బులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు సైతం వచ్చాయని గుర్తించారు. ఆ గ్రూపులోని మిగతా నలుగురికి బాం బ్‌లు పెట్టే ప్రాంతాల గుర్తింపును టార్గెట్ ఇచ్చినట్లు రి మాండ్ రిపోర్టులో వెల్లడించారు. తమకు ఆదేశాలు రావడం తో వాటి తయారీ కోసం టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్ సె ల్స్ అమెజాన్‌లో ఉగ్రవాది సిరాజ్ ఆర్డర్ చేశాడు.
కలిసి చదివారు… కలిసే పేలుళ్లకు ప్లాన్
హైదరాబాదులోని బోయ గూడలో ఉండే సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ అనే యువకు లు 2018లో హైదరాబాద్ సిటీలో కలిసి చదివారు. ఈ క్ర మంలో వారు తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యా రు. వీరు ‘ఆల్ హింద్ ఇత్తయ్ హాదుల్ ముస్లిమీన్‘ అనే సం స్థను నడుపుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

విజయనగరం చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు
ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఎ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం టూటౌన్ స్టేషన్‌కు వెళ్లారు. కేసుకు సంబంధించిన విషయాలను టూ టౌన్ పోలీసులను అడిగారు. నిందితులిద్దరికీ ఇప్పటికే విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఇ ప్పుడు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తు న్నారు. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ జరుగుతోంది. ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. విజయనగరం ఉగ్రవాది సిరాజ్ తండ్రి ,తమ్ముడు కూడా పోలీసులే. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్‌కు మాడ్యుల్ అదేశాలిచ్చినట్లు సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్ చేసినట్లు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ రెండు, మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు పోలీసుల చేతిలో ట్రావెల్ హిస్టరీ ఉంది. వీటన్నింటీపైనా నిర్ధారణకు సిరాజ్, సమీర్‌ని పోలీసులు కస్టడీకి కోరారు.

అంతర్జాతీయ యోగా డే టార్గెట్‌గా స్కెచ్..!?
ఐసిస్ ఉగ్రవాదులు ఎలాగైనా సరే ఇండియాలో బ్లాస్ట్‌లు చేయాలని అది హైదరాబాదులో ఎలాగైనా సరే భారీ ఎత్తున బ్లాస్టులు చేసి రక్తపాతం సృష్టించాలంటూ ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పథకం పన్నారు. యోగా డే టార్గెట్గా ఐసీస్ ఈ బాంబు పేలుళ్లను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు ఇంకా ఎవరైనా ఉన్నారా? యోగ డే రోజు మరేమన్న దాడులు జరిగే అవకాశం ఉందా? అన్న నేపథ్యంలో సెర్చ్ చేస్తు న్నా రు. పట్టుబడిన ఉగ్రవాదులకు ఎవరు సహకరించారు? వీరికి సహకరించిన స్లీపర్ సేల్స్ ఎవరు? ఇంకా మరి ఏమైనా ముఠాల రంగంలో దిగా యా? అన్నదానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఐఎస్‌ఐఎస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయా? అన్న దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్రను తెలుగు రాష్ట్రాల ఇంటెలిజేన్స్ వర్గాలు సంయుక్తంగా చేధిం చినప్పటికీ.. నిద్రాణంగా ఉన్న ఉగ్రమాలాలకు ఆయువుపట్టుగా భావిస్తున్న స్లీపర్‌సెల్స్ మూలాల గుట్టురట్టు దిశగా అటు కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇటు నిఘా వర్గాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం రంగంలోకి దిగి ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News