అంబులెన్స్‌లో ఆకిజన్ లేదు
ఇంతకన్నా దారుణం
ఏముంటుంది? అందాల
పోటీలపైనే కాదు..ప్రజల
ప్రాణాల రక్షణపైనా
ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి
ఇకనైనా ప్రభుత్వం అప్రమత్తం
కావాలి భవిష్యత్‌లో ఇలాంటి
ఘటనలు పునరావృతం
కాకుండా చర్యలు చేపట్టాలి
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద
బాధితులను పరామర్శించిన
అనంతరం బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/చార్మినార్/రాజేంద్రనగర్: గు ల్జార్ హౌస్ అగ్నిప్రమాద బాధితులు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు సరిపోవని, ఒక్కొక్కరికి రూ.25 లక్షల రూపాయల చొ ప్ప ను ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆ పార్టీ మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తది తర నేతలతో కలిసి సంఘటన జరిగిన భవ నా న్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారితో వివరాలు తెలుసుకున్నారు. అనంత రం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇం త పెద్ద సంఘటన జరగలేదన్నారు. అగ్నిమా ప క శకటంలో నీరు లేకపోవటం, సరియైన పరికరాలు లేకపోవటాన్ని తప్పు బట్టారు. ఈ సంఘటనతోనైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైన భవిష్యత్‌లు ఇలాంటి సంఘటనలు జరుగకుండా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలు సమకూర్చాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, చార్మినార్ వద్ద ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఎం, ఇక్కడి ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ తరపున తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ వైఫల్యమే గుల్జార్‌హౌస్ మృతుల సంఖ్యకు కారణం : కెటిఆర్
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంలో అసువులుబాసిన మృతుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కెటిఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులతో కలసి ఆయన సోమవారం ఉప్పర్‌పల్లి గౌతమ్ నగర్‌కు చేరుకున్నారు. బాధిత మోది కుటుంబ సభ్యులు, బంధువులను అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల బంధువులు అగ్నిమాపక దళాల సహాయక చర్యలు ఆలస్యం కావడంతో పాటు సకాలంలో అబులెన్స్‌లు రాకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని కన్నీటి పర్యంతమై కెటిఆర్‌కు వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు దాదాపుగా మృత్యువాత పడడం పట్ల కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ధించారు. ప్రభుత్వ సహాయక చర్యల వైఫల్యం కారణంగానే 125 ఏళ్లుగా గుల్జార్ హౌస్‌లోని దుర్ఘటన జరిగిన ఇంట్లో నివాసం ఉంటున్న మోది కుటుంబం మృత్యువాత పడిందని పలువురు కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కెటిఆర్ వెంట బిఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్, గులాబ్ సింగ్ తదితరులు ఉన్నారు.