మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రా జెక్టు విచారణ కమిషన్ గడువును ప్రభుత్వం మ రో రెండు నెలలపాటు పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొ జ్జ సోమవారం జివో 18 జారీచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏ ర్పాటుచేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జ స్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటుచేసిన సం గతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. సాంకేతి క, ఆర్ధిక , విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి అఫిడవిట్ల తీసుకుని వాటి ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌లను విచారణ పిలవాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచా రం. వీరిని పిలవకుండా నివేదిక ఇస్తే చెల్లుబాటు కాదని కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా వెళ్లరాదని కమిషన్ యోచించినట్లు సమాచారం.
జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పెంపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -