- Advertisement -
చెన్నై: రెండు గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధురాలిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది. మణలి కామరాజర్ అనే వీధిలో బొమ్మి(60) అనే మహిళ నివసిస్తోంది. శనివారం ఆమె బంధువులు తిరుపతికి వెళ్లడంతో బొమ్మి ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. ఇల్లు తుడిచే కర్ర పక్కింటి సందులో పడిపోయింది. దానిని తీయడానికి ఆమె అందులోకి వెళ్లింది. రెండు ఇళ్ల మధ్య ఆమె చిక్కుకొని విలవిలలాడింది. స్థానికులు వెంటనే గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి వృద్ధురాలును బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె స్వల్పంగా గాయపడ్డారని, చాతీ భాగంలో ఒత్తడికి గురికావడంతో స్వల్పంగా గాయపడినట్టు వైద్యులు వెల్లడించారు.
- Advertisement -