Wednesday, May 21, 2025

ప్రేమపెళ్లి… ఇంటికి 50 మీటర్ల దూరంలో మహిళ గొంతు కోసి…

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇంటికి కూతవేటు దూరంలో ఓమహిళ గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రంలోని నవీ ముంబయి ప్రాంతం ఉల్వేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం… కిశోర్ సింగ్ రాజ్‌పూత్ అనే వ్యక్తి, అల్వీనా కిశోర్ సింగ్ అలియాస్ అల్వీనా ఆదామిల్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజ్‌పూత్ డిఫార్మాసీ చేయగా ఆదామిల్ ఖాన్ బి ఫార్మసీ పూర్తి చేసింది. ఇద్దరు కలిసి మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. ఆదివారం ఖాన్ తన బంధువుల ఇంటికి వెళ్లింది. రాత్రి 11.45 తన ఇంటి సమీపంలోకి వచ్చింది. ఇంటికి యాబై దూరంలో ఓ వ్యక్తిని ఆమెను వెంబడించాడు.

రాడియన్స్ స్ల్పెండర్ బిల్డింగ్ సమీపంలోకి రాగాను ఆమె గొంతు కోసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖాన్ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకున్నట్టు గుర్తించారు. దంపతులు ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులకు తెలిసింది. పోలీసులు భర్తతో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News