Tuesday, May 20, 2025

గజపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ( Bhairavam)టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెం ట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే మంగళవారం మంచు మనోజ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మీడియాతో ముచ్చ టిస్తూ చెప్పిన విశేషాలు..

మంచి యాక్షన్ డ్రామా…
నేను ఒక సినిమా ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిశారు. డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలని అనుకుంటున్నారని చెప్పారు. అలా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డైరక్టర్ విజయ్ ఈ కథ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఇది చాలా మంచి యాక్షన్ డ్రామా. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు…ఈ సినిమాలోని గజపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్, ఫెరోషియస్ క్యారెక్టర్ ఇది. భైరవం తప్పకుండా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
పాత్రలన్నీ చాలా బలంగా…
ఇందులో ముగ్గురు హీరోల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎవరి స్క్రీన్ స్పేస్ వారిదే. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా రాశారు. పాత్రలన్నీ చాలా బలంగా ఉంటాయి. మా మధ్య స్నేహం పెరిగింది… సాయి నాకు తమ్ముడు లాంటి వాడు. రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా వలన మా మధ్య స్నేహం మరింత పెరిగింది. నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలున్నా షూటింగ్ కి ఇబ్బంది కలగకుండా జెట్ స్పీడ్‌లో చేసుకుంటూ వెళ్ళాం. డైరెక్టర్ విజయ్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఒక కుటుంబ సభ్యుడిలా అయిపోయారు.
నాకు మా ఫాదరే హీరో…
-మా నాన్నగారి నుంచి నమ్మిన వాళ్లని బాగా చూసుకోవడం, పదిమందికి సహాయం చేయడం నేర్చుకున్నాను. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో. ఇవన్నీ దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే… -అహం బ్రహ్మాస్మి సినిమాలో సోలో గా వద్దామని చేసుకున్న కథ. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే దేవుడు ఇలా ప్లాన్ చేశాడు. భైరవం, మిరాయి ఇవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది…
డైరెక్టర్ విజయ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయన లాంటి డైరెక్టర్స్ మరింత మంది రావాలి. ఈ సినిమాలో నా లుక్‌ని, నా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది కూడా డైరెక్టరే. సినిమా చూశాం. మాకు చాలా నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.
బ్యూటిఫుల్ ఆల్బమ్… శ్రీ చరణ్ బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. మంగళవారం ఒక స్పెషల్ సాంగ్ రాబోతుంది. సాంగ్ అదిరిపోయింది. అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చింపేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News