Wednesday, May 21, 2025

రాజ్‌భవన్‌ లో హార్డ్‌డిస్క్‌ చోరీ… కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్‌భవన్‌ హార్డ్‌డిస్క్‌ చోరీ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో రాజ్‌భవన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ ను అరెస్ట్‌ చేశారు. ఓ మహిళను వేధించిన కేసులో గతంలోనూ అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజ్‌ భవన్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు చోరీకి గురయ్యాయి. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదటి అంతస్తులోని రూమ్‌ నుంచి నాలుగు హార్డ్‌ డిస్క్‌లు అపహరణకు గురైనట్టు సిసి ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న రాత్రి చోరీ జరిగినట్టు నిర్ధారణకు రావడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి హెల్మెట్‌ ధరించి కంప్యూటర్‌ రూమ్‌లోకి ఒక వచ్చినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

రాజ్‌భవన్‌లో చోరీపై పోలీసులు స్పందించారు. చోరీ చేసిన హార్డ్‌ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని, శ్రీనివాస్‌ అనే ఉద్యోగి ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడని తెలియజేశారు. కేసులో శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామని, అతడిని అప్పటికే ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందన్నారు. బెయిల్‌పై బయటకొచ్చాక హెల్మెట్‌తో రాజ్‌భవన్‌లోకి వచ్చి తాను వాడిన సిస్టమ్‌లోని మహిళ మార్ఫింగ్‌ ఫొటోలు ఉన్న హార్డ్‌ డిస్క్‌ను తీసుకుని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News