- Advertisement -
హైదరాబాద్: మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి, పూర్తి జీతం చెల్లించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సిఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా, కాంగ్రెస్ సర్కార్ పెరిగిన జీతం ఇవ్వడం లేదని విమర్శించారు. మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి, గతేడాదిగా పాత జీతానికి పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు. జీతాన్ని రూ.13,650 నుంచి రూ.7,800 కు తగ్గించడం దారుణమని అన్నారు. మే నెల జీతాన్ని8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి, మిగిలిన జిల్లాలో ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.
- Advertisement -