- Advertisement -
మహబూబాబాద్: విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో నవ వరుడు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోడిపుంజుల తండాకు చెందిన ఇష్లావత్ నరేష్ అనే యువకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడులో యువతిని సోమవారం పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం బంధువులు, స్నేహితులకు తన ఇంటికి పిలిచి భోజనం ఏర్పాటు చేశాడు. ఇంట్లో నీళ్లు లేకపోవడంతో బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారు ఆన్ చేశాడు. విద్యుత్ షాక్ తగలడంతో నవ వరుడు అక్కడే దుర్మరణం చెందాడు. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోడిపుంజుల తండాలో విషాదఛాయలు అలుమకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవవరుడు
- Advertisement -