Wednesday, May 21, 2025

ఎన్టిఆర్ బర్త్‌డే గిఫ్ట్.. ‘వార్-2’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టిఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్-2’ (War 2 Movie). 2019లో వచ్చిన ‘వార్’ సినిమాకు ఇది సీక్వెల్. హృతిక్, ఎన్టిఆర్ కలిసి నటిస్తుండటంతో ‘వార్-2’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఎన్టిఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్-2(War 2 Movie) టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘నా కళ్లు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్’ అంటూ ఎన్టిఆర్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్‌లో హృతిక్, ఎన్టిఆర్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. చివర్లో ఎన్టిఆర్, హృతిక్‌ల నడుమ సాగే ఫైట్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ టీజర్‌లో పేర్కొంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News