Wednesday, May 21, 2025

ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంతాలియా ప్రాంతానికి సమీపంలోని కృష్ణనగర్-కరీంపూర్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని.. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కట్టర్లను ఉపయోగించి బయటకు తీశారు. ప్రైవేట్ కారు కృష్ణనగర్ నుండి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కృష్ణనగర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News