Thursday, August 21, 2025

గుడ్ న్యూస్.. మెట్రో చార్జీలు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మెట్రో చార్జీలను భారీగా పెంచిన యాజమాన్యం కాస్తా దిగొచ్చింది. తాజాగా మెట్రో రైలు సంస్థ టికెట్ ధరలను సవరించింది. మంగళవారం మెట్రో చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలపై 10 శాతం చార్జీలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టికెట్ ధరలను మే 24వ తేదీ నుండి అమలులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. కాగా, ఇటీవల కనిష్టంగా ఉన్న రూ.10 టికెట్ ధరను 12 రూపాయలకు పెంచింది. గరిష్టంగా ఉన్న 60 రూపాయల టికెట్ ధరను 75 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News