- Advertisement -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘భైరవం’. మంగళవారం మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా ‘భైరవం’ మూవీ నుంచి ‘రాజా రాజా’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో గజపతి క్యారెక్టర్ లో మనోజ్ నటిస్తున్నాడు. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.
- Advertisement -