Wednesday, May 21, 2025

హుందాగా ఉండండి

- Advertisement -
- Advertisement -

జనంలో పలుచనవుతాం.. జాగ్రత్త
అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరిక
ఐఎఎస్,ఐపిఎస్‌లు విధి నిర్వహణలో
నిబద్ధ్దత, అంకితభావం, క్రమశిక్షణతో
వ్యవహరించాలి గీత దాటితే కఠిన చర్యలు
తప్పవు కొందరు ఐఎఎస్‌లు స్థాయికి
తగ్గట్లుగా వ్యవహరించడం లేదని ఆక్షేపణ’

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల స మావేశాలు, సభల్లో చోటు చేసుకుంటున్న కొన్నిసంఘటనలు అవాంఛనీయమని ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అ భిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో తగ ని విధంగా ప్రవర్తించటం సరికాదని పేర్కొం టూ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో కొంతమం ది అఖిల భారత సర్వీసు అధికారులు సామూహిక సమావేశాలు, సభల్లో సర్వీసు హోదాకు తగనటువంటి చర్యలు, హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వ చ్చిందని, ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆ సర్వీ సు అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయే లా చేస్తుందని సిఎస్ తెలిపారు. అఖిల భార త సేవల ప్రవర్తనా నియమావళి, 1968 లోని నిబంధన 3(1) ప్రకారం ప్రతీ సర్వీసు అధికారి
ఆయన తెలిపారు. ప్రజలను కలిసినప్పుడు ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు హుందాతనం ప్రదర్శించాలని సిఎస్ సూచించారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు విధి నిర్వహణలో నిబద్ధతతో, అంకితభావంతో, క్రమశిక్షణతో వ్యవహారించాలని సిఎస్ పేర్కొన్నారు.

సచివాలయంలోని అన్ని విభాగాధిపతులు కూడా
సచివాలయంలోని అన్ని విభాగాధిపతులు కూడా నిబంధనలను అతిక్రమించకుండా తమ కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు కూడా సూచనలు ఇవ్వాలని సిఎస్ సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని సిఎస్ హెచ్చరించారు. సోమవారం అచ్చంపేట్‌లో జరిగిన సభలో గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ సిఎం రేవంత్‌కు పాదాభివందనం చేయడానికి పయత్నించడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎస్ రామకృష్ణారావు ఆల్‌ఇండియా సర్వీసెస్ అధికారుల నియమావళిని మరోసారి గుర్తు చేస్తూ ఈ రెండు మెమోలను జారీ చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News