- Advertisement -
ఎంఎల్‌ఎలకు సిఎం రేవంత్ క్లాస్
పలువురు ఎంఎల్‌ఎలతో సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ్యులు తమ పని తీరును మెరుగుపరుచుకోవాలని ఒకరిద్దరు ఎంఎల్‌ఎలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎంఎల్‌ఎలతో మంగళవారం సిఎం సమావేశమయ్యారు. కంటోన్మెంట్, మెదక్ ఎంఎల్‌ఎలను కూడా సమావేశానికి పిలిచి వారి పనితీరుపై ఇంటలిజెన్స్ నివేదికలను ఎంఎల్‌ఎల ముందు ఉంచారు. పాలమూ రు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో అంతర్గత పంచాయితీలను సెటిల్ చేసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఎంఎల్‌ఎలకు సూచించారు.
- Advertisement -