Wednesday, May 21, 2025

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
నలుగురు మృతి.. 20 మందికి పైగా తీవ్రగాయాలు
క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమం పరిగి
మండలం, రంగాపూర్ సమీపంలో ఘటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం
ప్రసాద్‌కుమార్ దిగ్భ్రాంతి

మన తెలంగాణ/పరిగి: వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్‌ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న సిమెంట్ లోడ్ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగు రు మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గా యాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండ లం, చందనవెళ్లి గ్రామానికి చెందిన మంగళి రామస్వా మి కుమారుడు సతీష్‌తో పరిగిలోని మంగళి రామకృష్ణ కూతురు మల్లేశ్వరికి ఈ నెల 16వ తేదీన వివాహం జరిగింది. ఆదివారం పెళ్లి కుమారుడి ఇంటి వద్ద ధావత్ చేశా రు. మరుసటిరోజు సోమవారం పరిగిలో పెళ్లి కూతురు ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను చం దనవెళ్లి నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సుమారు 50 మందికి పైగా వచ్చారు. దావత్ చేసుకుని రాత్రి పది గంటలకు వెళ్లాల్సినవారు బస్సు ఆలస్యం కావడంతో రాత్రి 1:30 గంటలకు తిరుగు ప్రయాణంలో బయలుదేరారు.

పరిగి మండలం, రంగాపూర్ స్టేజీ సమీపంలో లా రీ కర్ణాటక రాష్ట్రం, సేడం నుంచి హైదరాబాద్‌కు సిమెంట్ తీసుకువెళ్తున్న క్రమంలో ఆగి ఉంది. బస్సు డ్రైవర్ యూ సుఫ్ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పింబోయి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో రంగారెడ్డి జి ల్లా, షాబాద్ మండలం, సీతారాంపూర్‌కు చెందిన మం గళి మల్లేష్ (35), అదే మండలం సోలిపేట్‌కు చెందిన బాలమ్మ (60), చెవెళ్ల మండలం, రావులపల్లికి చెందిన హేమలత (32), ఫరూఖ్‌నగర్ మండలం, కిషన్‌నగర్‌కు చెందిన సందీప్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పరిగి ఎస్‌ఐ సంతోష్‌కుమార్, చన్‌గోములు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, పోలీస్ బృందం సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమించడంతో వారిని వికారాబాద్ ఈషా ఆసుపత్రికి తరలించారు. వీరిలో సుజాత, నీరజ, అరుణ, సాహితి, నిహారిక, మహేష్, వైమాలిక, కార్తీక్, రమేష్, లక్ష్మి, రాము లు, మంజుల, సుజాత, నవనీతకు తీవ్ర గాయాలయ్యా యి, మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారంతా ఈషాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి, మరొకరిని నిమ్స్ కు రిఫర్ చేశారు. మృతదేహాలకు పరిగి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిగి ప్ర భుత్వ ఆసుపత్రిని ఆర్‌డిఒ వాసుచంద్ర, డిఎస్‌పి శ్రీనివా స్, సిఐ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్‌దార్ ఆనంద్‌రావు, మార్కె ట్ కమిటీ ఛైర్మన్ పరుశరాంరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి హన్మంత్, పట్ణణ అధ్యక్షుడు కృష్ణ, పాలాది శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు.

సిఎం, స్పీకర్ దిగ్భ్రాంతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సిఎం రేవంత్‌రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి తక్షణ సహాయక చర్యలు అందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సిఎం సానుభూతి తెలిపా రు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలపైన సంఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News