Thursday, May 22, 2025

నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. హోంమంత్రి మెడికల్ కాలేజీపై ఈడి దాడులు

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో సంచలనం సృష్టించిన నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు పెంచింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బుధవారం కర్ణాటకలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వరకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీపై ఈడీ దాడి చేసింది. శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఛైర్మన్‌గా హోంమంత్రి పరమేశ్వర ఉన్నట్లు ఈడీ తెలిపింది.

కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుతోపాటు తరుణ్ రాజ్ కొండూరుకు బెంగళూరు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. అయితే, కేంద్రం ముగ్గురిపై కొఫిపోసా చట్టాన్ని ప్రయోగించింది. బెయిల్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు నిందితులను నిర్బంధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దీంతో బెయిల్ వచ్చినా రన్యారావు జైలులోనే ఉండే పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News