- Advertisement -
క్వెట్టా: పాకిస్తాన్‌లోని ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మరణించారని, మరో 38 మంది గాయపడ్డారని అధికారులను వెల్లడించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో స్కూల్ బస్సు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ దాడికి ఏ టెర్రర్ గ్రూపు ఇంకా స్పందిచలేదు.
ఈ ఆత్మహుతి దాడి పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. చిన్నారుల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అమాయక ప్రాణాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిని అనాగరికత చర్యగా అభివర్ణించారు.
- Advertisement -